గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ గత రెండు వారాల క్రితం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే లో గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ పాస్టర్లు తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ను కలిసి, రానున్న ఈస్టర్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ బరియర్ గ్రౌండ్ నందు చెట్లు చామలు పెరిగి ఉన్నవని మున్సిపల్ సిబ్బంది చేత బరియల్ గ్రౌండ్ ని శుభ్రపరిచేందుకు తగిన చర్యలు చేపట్టవలసినదిగా కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగినది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కమీషనర్ గారిని ఈస్టర్ లోపల బరియల్ గ్రౌండ్లో ఉన్న ఖాళీ స్థలంలో పెరిగి ఉన్న చెట్లు చామలన్నిటిని జెసిబి లతో క్లీన్ చేయించవలసినదిగా ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశానుసారము గూడూరు మున్సిపల్ కమిషనర్ గత రెండు రోజుల నుండి జెసిబి లతో క్రిస్టియన్ బరియర్ గ్రౌండ్ లోని కాళీ స్థలంలో పెరిగివున్న ముళ్ళచెట్లను క్లీన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు బక్కా రత్న శేఖర్ కార్యదర్శి తాటిపర్తి డేవిడ్, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మరియు బరియల్ గ్రౌండ్ సెక్రటరీ వేల్పుల ప్రభుదాస్ , బరియర్ గ్రౌండ్ ఇన్చార్జి కిషోర్, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మరియు బరియల్ గ్రౌండ్ కమిటీ కార్యవర్గ సభ్యుడు ఎం. రమేష్ తదితరులు పాల్గొని ఆ పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేకు బరియల్ గ్రౌండ్ సమస్య తెలిపిన వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించి ఈ బరియల్ గ్రౌండ్ ను శుభ్రం చేయిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు .అలాగే ఎమ్మెల్యే ఆదేశానుసారం బరియల్ గ్రౌండ్ ను శుభ్రపరిచేందుకు తగిన చర్యలు తీసుకున్న మున్సిపల్ కమిషనర్ కి , జెసిబి సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.



