
కావ్యపురుషుడు శ్రీరాముడే : యోగి ఆదిత్యనాథ్
భారతదేశంలో సనాతన ధర్మానికి అయోధ్యే మూలక్షేత్రమని ఉత్తరప్రదేశ్ CM యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అయోధ్యలో జరిగిన సాహితీ ఉత్సవంలో ఆయన ప్రసంగిస్తూ శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడనీ, ఆయన గురించి రచనలు చేసినవారు గొప్ప వ్యక్తులైపోతారని వాల్మీకికి నారదుడు చెప్పడాన్ని ప్రస్తావించారు. 2016-17లో కేవలం 2.34లక్షలమంది అయోధ్యను సందర్శించగా, నేడు ఒక్కరోజుకే 2.50లక్షల మంది వస్తున్నారనీ, 2024లో ఇక్కడి రామాలయాన్ని 16 కోట్లమంది దర్శించారని వివరించారు.