*నిబంధనలు కు విరుద్ధంగా ఆటోలు నడిపితే కేసులు నమోదు*

ఆటో లో పరిమితికి మించి ప్యాసింజర్ ని
ఎక్కించుకుంటే చర్యలు తప్పవు ..SI. మనోజ్ కుమార్*
*అతివేగంగా,ఓవర్టేక్, రాంగ్ రూట్, నడిపే ఆటోలును సీజ్*
*డ్రైవింగ్ లైసెన్సు , ఇన్సూరెన్స్ ,యూనిఫామ్ తప్పనిసరి,*
*నిర్లక్ష్యంగా వ్యవహరించిన, మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు*
ట్రాఫిక్ ,,ప్రమాదాలు నియంత్రణ లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు బైపాస్ గూడలి వద్ద రూరల్ ఎస్ ఐ,మనోజ్ కుమార్ ఆటో డ్రైవర్ కు అవగాహన కల్పిస్తూ నిబంధనలును నిర్లక్ష్యంగా చెయ్యద్దుని, ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ప్రమాదాలు కు కారకులు అవ్వద్దుని తెలిపారు. ఆటోలో పరిమితికి మించి ప్యాసింజెర్స్ ను ఎక్కించుకోవడం,
అతివేగంగా వెళ్లడం, ఓవర్టేక్ ,రాంగ్ రూట్ ,
నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం లాంటి చర్యలు కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు, అటువంటి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు ను సీజ్ చేస్తామని తెలిపారు.ఆటో డ్రైవర్లు తప్పకుండా యూనిఫామ్ ధరించి,వాహనాలు కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు ,ఇన్సూరెన్స్ ,సరియైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు,
