ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యులు గా నామినేషన్ దాఖలు చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గెలుపు ఏకగ్రీవం అయినట్లు ధృవీకరిస్తూ శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శ్రీమతి వనితా రాణి అసెంబ్లీ నందు డిక్లరేషన్ (ధ్రువీకరణ పత్రం) ఫాం ను బీద కు అందజేశారు.ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు , మంత్రి వర్యులు నారా లోకేష్ కు రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు బీద తో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ , ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు , ఉమ్మడి నెల్లూరు జిల్లా శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ ఉన్నారు
