Advertisements

స్కిల్ ఆంధ్రా – లోకేష్ పక్కా వ్యూహం !

స్కిల్ ఆంధ్రా – లోకేష్ పక్కా వ్యూహం !

ప్రతి ఒక్కరిలో ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించేలేని వారు కొందరు.. గుర్తించినా ఆ టాలెంట్ లో ఎలా అవకాశాలు పొందాలో తెలియని వారు కొందరు ఉంటారు. అలాంటి యువతకు సరైన అవకాశాలు కల్పించి దారిలో పెట్టేందుకు లోకేష్ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలతో స్కిల్ శిక్షణ..రీ స్కిల్లింగ్ చేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ తో చేసుకున్న ఒప్పందం అలాంటిదే. ఏడాది వ్యవధిలో రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి అంతర్జాతీయంగా ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నారు.

యువతకు ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా లోకేష్ పారిశ్రామిక విధానాన్ని ఉపయోగించుకుని ఇండస్ట్రీస్ ను ఆకర్షించేప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో స్కిల్ సెన్సెస్ నిర్వహించాలని అనుకుంటున్నారు. స్కిల్ సెన్సెస్ ద్వారా ఎవరెవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి.. వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు అవసరం అన్నదానిపై పరిసీలన చేయనున్నారు. ఆ తర్వాత వారికి తగ్గ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇందు కోసం మల్టీనేషనల్ కంపెనీలతో సంప్రదిస్తున్నారు.

రాష్ట్రంలో ఉండే యువతకు ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించేలా చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా తెలుగు యువతకు అవకాశాలు వచ్చేలా చేయడానికి ట్రైనింగ్ ఇప్పించేందుకు లోకేష్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తో పాటు గూగుల్ వంటి సంస్థలు కూడా త్వరలో రాష్ట్రంలో తమ శిక్షణ కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Comment