
https://youtu.be/WC1bpzA3-Bk?si=WOMojExt9e72pGvg
గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ…పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలందరూ సహకరించాలని, తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినపుడు ఇవ్వాలని, దీనివల్ల జబ్బులు రాకుండా ఉంటాయని తెలిపారు. పర్యావరణానికి ప్రమాదకర స్థాయిలో ప్లాస్టిక్ వాడకం ఉందని వ్యాపారస్తులకు ఈ నెల 15వ తేదీ వరకు సమయం ఇచ్చామని ఆ తరువాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పురపాలక సంఘం అందిస్తున్న మౌలిక వసతులకు ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లిస్తే సిబ్బందికి జీతాలు ఇవ్వడం జరుగుతుందని పన్నులు చెల్లించని వారి నివాసాలను జప్తు చేయడం జరుగుతుందని వెల్లడించారు .