
జిల్లాకు 100 ఎలక్ట్రికల్ బస్సులు
గుంటూరు: కేంద్రం నుంచి గుంటూరు ఆర్టీసీ డిపో-2కు వంద ఎలక్ట్రికల్ బస్సులు మంజూరైనట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో ఇవి అమలులోకి వస్తాయన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు జిల్లా చుట్టుపక్కల 40కి.మీ పరిధిలో ప్రయాణిస్తాయని వెల్లడించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో 5 ఎకరాలను ఎలక్ట్రికల్ బస్సుల కోసం వినియోగిస్తామని అన్నారు.