
ట్రాపిక్ నియంత్రణ లో భాగంగా గూడూరు పట్టణములో DSP గీత కుమారి ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.నారాయణ కాలేజ్ మినీ బై పాస్ నుండి రాంగ్ రూట్ లో చిల్లకూరు. బైపాస్ వైపు వస్తున్న నాలుగు వాహనాలు ను DSP ,గీతా కుమారి,మరియు గూడూరు రూరల్ ఎస్ ఐ. మనోజ్ కుమార్ పట్టుకొని కేసు రిజిస్ట్రేషన్ చేశారు.

Dsp మాట్లాడుతూ
పట్టణంలో వాహన దారులు ట్రాపిక్ నియమ నిబంధనలు లు ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని. సూచించారు. వాహనాదారులు వాహనాలకు సంబంధించిన సరియైన పత్రాలు కలిగి ఉండాలని .రాంగ్ రూట్లో వాహనాలు నడిపిన ,,వితౌట్ హెల్మెట్, మోడీఫైడ్ సైలెన్సర్, మల్టి టోన్ సైరన్, త్రిబుల్ డ్రైవ్ కి పాల్పడిన నిబంధనలు ఉల్లంఘించిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదుని. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని DSPగీతకుమారి హెచ్చరించారు. ప్రజలకు సురక్షితమైన మరియు క్రమబద్ధమైన ట్రాఫిక్ నిర్వహణను అందించడమే తమ కర్తవ్యంని తెలిపారు.


