Advertisements

బద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు!

బద్రీనాథ్ లో విరిగిపడ్డ మంచు చరియలు!

ఉత్తరాఖండ్‌లోఈరోజు ఉదయం పెను ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండడంతో చరియలు విరిగిపడ్డాయి, చమోలీ జిల్లాలో మంచు కొండ కుప్పకూలింది.

ఈ ఘటనలో 57 మంది కార్మికులు ఆ మంచు కొండ కింద చిక్కుకుపోయారు. అందులో 10 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. మరో 47 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది.

రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగి స్తున్నారు. చమోలీ జిల్లా లోని చమోలీ-బద్రీనాథ్ జాతీయ రహదారిపై మన గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రోడ్డు నిర్మాణ కార్మికులు తమ పనిలో నిమగ్నం కాగా.. ఒక్కసారిగా మంచుకొండ విరిగిపడింది. దీంతో మంచు శిథిలాల కింద.. కార్మికులు అంతా చిక్కుకుపోయారు.

ప్రమాద సమాచారం తెలియగానే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-ఎస్‌డీ ఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-ఎన్‌డీ ఆర్ఎఫ్, చమోలీ జిల్లా అధికార యంత్రాంగం, ఇండో- టిబెటన్ బోర్డర్ ఫోర్స్-ఐటీబీపీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్-బీఆర్ఓ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి రిస్క్టింగ్ టీం..

ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.

Leave a Comment