
అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా…
భీమడోలు
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడిన ఘటనలో అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న పేషెంట్ తో పాటు అంబులెన్స్ డ్రైవర్ కు గాయాలైన ఘటన భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగిని తాడేపల్లిగూడెం నుండి విజయవాడ తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది…
ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ అతని అసిస్టెంట్ రోగి బంధువు కు గాయాలయ్యాయి ..
సమాచారం అందుకున్న 108 సిబ్బంది రోగిని, రోగి బంధువును విజయవాడ తరలించి అంబులెన్స్ డ్రైవర్, అసిస్టెంట్ ను తాడేపల్లిగూడెం తరలించారు…