Advertisements

ఓబులవారిపల్లె పీఎస్కు పోసాని – స్టేషన్‌లోనే వైద్యపరీక్షలు –

ఓబులవారిపల్లె పీఎస్కు పోసాని – స్టేషన్‌లోనే వైద్యపరీక్షలు –

పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె తీసుకొచ్చిన పోలీసులు – పోలీసు స్టేషన్‌లోనే వైద్యపరీక్షలు నిర్వహించే అవకాశం

వైఎస్సార్సీపీ హయాంలో నాలుకకు నరం లేదన్నట్లుగా చంద్రబాబు, పవన్‌, లోకేశ్​పై బండబూతులతో దాడి చేసిన సినీనటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం రాత్రి పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్‌లోనే పోసానికి ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పోసాని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పవన్‌ కల్యాణ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై పోసానిని అసభ్యంగా ధూషించారంటూ చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్‌ జోగినేని మణి ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం ఓబులవారిపల్లె పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో పోసానిపై 196, 353(2), 111 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Comment