
ఢిల్లీ ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న నిందితులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు బంగారాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి, దాన్ని ఖర్జూరం పండ్లలో దాచి బాడర్ దాటించేందుకు ప్రయత్నించారు. లగేజ్ చెకింగ్ సమయంలో మెటల్ డిటెక్టర్ బంగారాన్ని గుర్తించడంతో నిందితులు పట్టుబడ్డారు. కస్టమ్స్ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.