Advertisements

అభిమాని అందించిన ప్రత్యేక బహుమతికి ఆనందం వ్యక్తం చేసిన నారా లోకేశ్

అభిమాని అందించిన ప్రత్యేక బహుమతికి ఆనందం వ్యక్తం చేసిన నారా లోకేశ్

చంద్రబాబు కుటుంబ సభ్యుల చిత్రాలతో నేసిన చేనేత వస్త్రం బహూకరణ

అభిమాని నైపుణ్యాన్ని ప్రశంసించిన మంత్రి లోకేశ్
సామాజిక సేవా

కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ

మంగళగిరికి చెందిన టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ మంత్రి నారా లోకేశ్‌‌కు ప్రత్యేక బహుమతి అందించారు. ఈ బహుమతిపై నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. వారు చేతితో నేసిన చేనేత వస్త్రం‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ చిత్రాన్ని రూపొందించారు.

ఈ అరుదైన అనూహ్య కానుకను స్వీకరించిన లోకేశ్ వారి నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తండ్రి, కుటుంబ సభ్యుల చిత్రాలతో నేసిన వస్త్రాన్ని స్వీకరించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వారు ఆసక్తి చూపడంపై అభినందించారు. వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.

Leave a Comment