బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో సంవిధన్ గౌరవ అభియాన్ కార్యక్రమం విద్యార్థులతో రాజ్యాంగ గౌరవ ర్యాలీ
భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు శాఖ ఆధ్వర్యంలో సంవిధన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించిన సందర్బంగా BJYM గూడూరు ఆధ్వర్యంలో రాజ్యాంగ గౌరవ ర్యాలీ మరియు సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ 75 సంవత్సరాల రాజ్యాంగ ఘన చరిత్రను ప్రజలకు వివరిస్తు రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు అది మన జీవితానికి దశా దిశాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చిన గొప్ప కానుక అన్ని పేర్కొనడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మరించుకుంటూ వారి ఆశయాలను విద్యార్థులకు యువకులకు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించమని ఆయన తెలిపారు అదేవిధంగా కిసాన్ మోర్చా కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని ముందడుగు వేయించారని ఆయన పేర్కొన్నారు మరియు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం గూడూరు పట్టణ అధ్యక్షులు శివశంకర్ బీజేవైఎం నాయకులు ప్రణయ్ సుమన్ మరియు కార్తీక్ అదేవిధంగా విద్యార్థుల విద్యార్థులు యువకులు స్వర్ణాంధ్ర పార్టీ కళాశాల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు