Advertisements

తెలంగాణలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్సలెన్స్ సెంటర్‌ను

తెలంగాణలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్‌ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

సంగారెడ్డిలో ప్రస్తుతమున్నసుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సెలెన్స్ సెంటర్ను నెలకొల్పుతారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా సుహానా డైరెక్టర్ ఆనంద్ చోర్డియా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు.

రాబోయే రెండు మూడేండ్లలో ఈ సెంటర్ ద్వారా 25 వేల నుంచి 30 వేల మంది రైతులకు శిక్షణనిస్తారు.

సుగంధ ద్రవ్యాల నాణ్యత మరియు వ్యవసాయ పద్ధతులను అధునికరించే నైపుణ్యాలు అందిస్తారు.

సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించటంతో పాటు రైతుల జీవనోపాధి పెంచేలా మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తుంది.

ఈ సెంటర్ పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో సహజ వనరుల సంరక్షణకు సహాయపడుతుంది..

అత్యాధునిక సాంకేతికతలు, పరిశోధనలు చేపడుతుంది. దేశంలోని అతిపెద్ద మిరప ప్రాసెసింగ్ యూనిట్లలో ఒకటైన సంగారెడ్డిని ఈ సెంటర్ ఏర్పాటుకు కీలకంగా ఎంచుకుంది.

ప్రభుత్వ సహకారంతో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని సుహానా మసాలా ప్రతినిధులు అన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This