సమాచారం తెలుసుకొన్న కోట ఎస్సై పవన్ కుమార్, వాకాడు ఎస్సై నాగబాబు
కోళ్ల పందెం స్థావరంపై మెరుపు దాడులు
10మంది పందెం రాయుళ్లు అరెస్ట్ -9 పందెం కోళ్లు, 10 వేల రూపాయలు నగదు స్వాధీనం
10 మంది పందెం రాయుళ్ల పై కేసు నమోదు
కోళ్ల పందెం స్థావరంపై కోట, వాకాడు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తిరుపతి జిల్లా, కోట మండలం, దొరువు కట్ట గ్రామ శివారులో సంక్రాంతి పండుగలు అయినా కూడ ఆదివారం కోళ్ల పందాలు ఆడుతున్న స్థావరంపై కోట ఎస్సై పవన్ కుమార్, వాకాడు ఎస్సై నాగబాబు పోలీసు సిబ్బంది తో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 10 మంది పందెం రాయుళ్లతో పాటు 9పందెం కోళ్ళు,రూ. 10,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లు తెలిపారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలు ఆడుతూ ఆదివారం కోట మండలం, దొరువుకట్ట గ్రామ శివారు లో పలువురు పందెం రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. కోడి పందేల బెట్టింగులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.జిల్లా యస్.పి.జి. కృష్ణకాంత్ వాకాడు సి ఐ హుసేన్ బాషా ఆదేశాల మేరకు కోట, వాకాడు మండలాల్లో పోలీసులు దృష్టి సారించారు.
కోట, వాకాడు మండలాల్లోనీ పలు ప్రాంతాల్లో బెట్టింగులు, కోడి పందెలు, జూదం, పేకాట లు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ హెచ్చరించారు. గ్రామాల్లో కోడి పందెలు, జూదం, పేకాట లు ఆడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ సమాచారం ఇచ్చిన వారి పేర్లు గొప్యం గా ఉంచబడును అన్నారు.