Advertisements

భక్తి శ్రద్దలతో నిషాన్

భక్తి శ్రద్దలతో నిషాన్
వేదాయపాలెం: వేదాయపాలెం మినీ బైపాస్ అండర్ బ్రిడ్జి క్రింద వెలసియున్న హజరత్ సయ్యద్ ముషర్రఫ్ అలీ షా చిష్టి ఉల్ ఖాదరి గారి 15 వ గంధమహోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా బుధవారం రాత్రి దర్గా ఆవరణంలో పీఠాధిపతి ఖదీర్ అలీ షా చిష్టి ఉల్ ఖాదరి ఆధ్వర్యంలో నిషాన్ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఖలీఫాలు మగ్దూమ్ అలీ షా, ఆరిఫ్ ఖాదరి ల ప్రత్యేక ప్రార్ధనలతో నిషాన్ ను ఊరేగించి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మగ్దూమ్ అలీ షా, ఖదీర్ అలీ షా లు మాట్లాడుతూ మా గురువు మార్గదర్శకులు హజరత్ ఖ్వాజ సయ్యద్ షా ముషర్రఫ్ అలీ షా చిష్టి ఉల్ ఖాదరి గారి 15 వ గంధమహోత్సవం అని ముందుగా నిషాన్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ నెల 8 వ తేది బుధవారం గందం జరగనుందని భక్తుల సౌకర్యార్ధం దర్గా ఆవరణంలో అన్నదానం నిర్వహిస్తామని రాత్రంతయు దర్గా లో దావూద్ పార్టీ పర్వీన్ పార్టీ ల ఆధ్వర్యంలో భక్తి గీతాలాపన జరగనుందని కావున బాబా గారి శిష్యులు ఖలీఫాలు భక్తులు అత్యధిక శాతంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఖదీర్ అలీ షా, మగ్దూమ్ అలీ షా, ఏజాజ్ షరీఫ్, ఆరీఫ్ ఖాదరి, నజీర్, సలీం చిష్టి,ఆరిఫ్ షరీఫ్,డాక్టర్ సయ్యద్ బాబా, కరీముల్లా, తజమ్ముల్, జావెద్, హీదాయత్, షేర్ ఖాన్, పర్వీన్, జుబేర్, ఫైజుల్లాహ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment