Advertisements

గూడూరు పట్టణం యెరుషలేము ప్రార్థన మందిరం నందు పేదలకు బట్టలు, దుప్పట్లు పంపిణీ

ముఖ్యఅతిథిగా పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టిడిపి క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్

           2025 నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణం 6వ వార్డు లోని యెరుషలేము ప్రార్థన మందిరం నందు చర్చి పాస్టర్ ఆహ్వానం మేరకు గూడూరు మాజీ కౌన్సిలర్ మరియు తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ముఖ్యఅతిథిగా నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రార్థనా కూటమిలో పాల్గొని ప్రార్థన మందిరం నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించి, పేదలకు వృద్ధులకు బట్టలు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది . అనంతరం సండే స్కూల్ పిల్లలకు బహుమతులు కూడా అందజేయడం జరిగింది.

            ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ , ఎరుషలేము ప్రార్థన మందిరం పాస్టర్ ప్రభుదాస్ , దైవ సందేశం అందించిన పాస్టర్ ఇస్సాకు, గూడూరు పట్టణ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్ష , ఉపాధ్యక్షులు పల్లి కోటేశ్వరరావు, వేల్పుల రమేష్ కుమార్ , గూడూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటసుబ్బయ్య  మరియు చర్చి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment