Advertisements

ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపుమేరకు పేద హాస్టల్ విద్యార్థుల కొరకు ప్లేట్లు అందజేసిన మాజీ కౌన్సిలర్ ఇశ్రాయేల్ కుమార్ కుమార్

2025 నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ తనను కలవడానికి వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలు తీసుకొని రాకుండా,   పేదలకు , పేద విద్యార్థిని, విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్సు ఇతర వస్తువులు తీసుకొని రావాలని ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు టీడీపీ తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మరియు గూడూరు మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, ఎమ్మెల్యే ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి తన తల్లి గారైన స్వర్గీయ బక్కా శారమ్మ టీచర్ గారి పేరు మీద  60 మంది పేద విద్యార్థిని, విద్యార్థుల కొరకు స్టీల్ భోజనం ప్లేట్లు అందజేయడం జరిగింది.

         ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పల్లి కోటేశ్వరరావు, వేల్పుల రమేష్ కుమార్ తెలుగు మహిళ పట్టణ కార్యదర్శి పోబాక లక్ష్మి ,ముస్లిం మైనారిటీ పట్టణ నాయకుడు హారూన్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment