Advertisements

డిసెంబరు31వ తేది రాత్రి నియమ నిబంధనలు పాటించని వారి పై కఠిన చర్యలు -గూడూరు dsp

తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో dsp offce నందు  పోలీసు శాఖ అధికారులు  నిర్వహించారు.ఈ సందర్భంగా dsp రమణ కుమార్ మాట్లాడుతూ ముందుగా గూడూరు డివిజను పరిధిలోని ప్రజలందరికి పోలీసు శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు .శాంతి భద్రతల పరి రక్షణలో భాగంగా డిసెంబరు31వ తేది రాత్రి కొన్ని నియమ నిబంధనలు జారీ చేశారు.
డిసెంబరు31వ తేది రాత్రి రోడ్ల మీద గుంపులు గుంపులుగా చేరి తిరగడంగాని, మోటారు సైకిళ్ళతో పెద్దగా శబ్దాలు చేస్తూ అటు ఇటు వెళ్ళడం గాని, రోడ్ల మీద కేకులు కట్ చేయడం గాని నిషేదమని తెల్పరూ నూతన సంవత్సర వేడుకలు బహిరంగ ప్రదేశాలలో (Public Places) నిర్వహించాలనుకుంటే, తప్పనిసరిగా DSP  వద్ద నుండి ముందస్తు అనుమతి  తప్ప కుండా తీసుకోవాలని తెలిపారు.
D.J లు గాని, అసభ్యకరమైన చర్యలుగాని అనుమతించబడవు. నూతన సంవత్సర వేడుకల పేరిట ఎవ్వరైనా సాధారణ ప్రజా జీవనానికి ఆటంకాలు కలిగిస్తే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాంన్నారు
ఎవ్వరైనా చట్టాన్ని అతిక్రమించి ప్రజా శాంతికి భంగం కల్గిస్తే, మీకు దగ్గరలో వున్న పోలీసు వారికి గాని లేదా Dail-100 కి గాని ప్రజలు తెలియపరచమని కోరారు.అన్ని ముఖ్య ప్రదేశాలలో గట్టి పోలీసు గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఆ రోజు రాత్రి అన్ని ముఖ్య ప్రదేశాలలో Drunk & Drive పరీక్షలు నిర్వహించబడుతాయని ,పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  1 టౌన్ 2 టౌన్ రూరల్ సి ఐ,లు,   తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment