Advertisements

ఒక్క రాయితో.. అపర కోటీశ్వరుడు..

ఒక్క రాయితో.. అపర కోటీశ్వరుడు..

ఎలాగో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

జీవితంలో కొన్నిసార్లు ఊహించని, ఆశ్చర్యకరమైన ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేం. ఉదాహరణకు ఓ నిరుపేద రాత్రికి రాత్రి లాటరీ తగిలి కోటీశ్వరుడు కావడం వంటి ఎన్నో ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి ఘటనే ఒకటి ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి విషయంలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.. ఓ రాయిలో బంగారం ఉంటుందని అతగాడు ఎంతో కష్టపడి దానిని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. చివరకు చేతకాక పరిశోధకుల దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే బంగారం లేదు కానీ.. అంతకుమించే సాధించానని తెలియడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేవు. ప్రపంచంలో కోట్లలో ఒక్కరికే మాత్రమే కనిపించే రాయిని కనుగొని బంపర్ ఆఫర్ అందుకున్నాడు. బంగారం కంటే వందల రెట్ల విలువైన రాయితో రాత్రికి రాత్రే వందల కోట్లకు అధిపతి అయిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇతగాడి గురించే చర్చ. ఇంతకీ ఏం జరిగిదంటే..

ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ హోల్‌కు విలువైన రత్నాలు, అరుదైన రాళ్లను సేకరించడం హాబీ. అందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు వెనుకాడడు. అలా 2015లో పార్క్‌లో వెళుతుండగా ఎర్రటి రంగుగల ఓ బరువైన రాయిని కనుగొన్నాడు. దాని లోపల బంగారం ఉంటుందనే ఉద్దేశంతో రాయిని పగలగొట్టేందుకు ఏళ్ల తరబడి శతవిధాలా ప్రయత్నించాడు. బరువైన సుత్తి, యాసిడ్ సహా ఎన్ని సాధనాలు వాడినా రాయిలో కాస్త కూడా పగుళ్లు రాలేదు. ఏళ్ల తరబడి విఫల ప్రయత్నాలు చేశాక చివరికి ఆ రాయిని మెల్‌బోర్న్ మ్యూజియమ్‌కి తీసుకెళ్లి చూపించాడు. అక్కడ ఆ రాయిని పరిశోధించిన పురాతత్వ శాస్త్రవేత్తలు డేవిడ్ హోల్ బంగారం కంటే వేల రెట్లు విలువైందని గుర్తించారు. ప్రపంచంలో అత్యంత అరుదైన ఈ రాయి విలువ వేల మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు నిపుణులు.

డేవిడ్ హోల్‌ కనిపెట్టిన అరుదైన రాయి ఒక ఉల్క. దాని పేరు మేరీబోరో. 17 కిలోల బరువున్న ఈ రాయి 4.6 బిలియన్ సంవత్సరాలు క్రితం నాటిది. నికెల్, ఐరన్ మూలకాల మిశ్రమైన ఈ రాయి అంగారకుడు(మార్స్), బృహస్పతి(జూపిటర్) మధ్య ఉన్న ఉల్క బెల్ట్ ద్వారా 100 నుంచి 1000 సంవత్సరాల మధ్య భూమికి చేరి ఉంటుందని మెల్‌బోర్న్ పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఉల్క ద్వారా సౌరవ్యవస్థలో అంతుచిక్కని రహస్యాలను అధ్యయనం చేయవచ్చు. డేవిడ్ హోల్ ఆవిష్కరణ ఓ నిజమైన సంపద అని, దీని విలువ ట్రిలియన్ డాలర్లు అయినా ఉండవచ్చని లెక్కగడుతున్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఈ ఉల్కతో సహా ఇప్పటివరకూ 17 అరుదైన ఉల్కలను గుర్తించారు పరిశోధకులు..

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This