
గూడూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని
బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామంలో దళితుల పై జరిగిన దాడులను భీమ్ ఆర్మీ వ్యవస్తాపకులు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి పులి శ్రీకాంత్ ఖండించారు. గూడూరు డివిజన్ దళిత సంఘాల ప్రతినిధులు .మన్నూరు దళితులపై దాడులు,అక్రమ కేసుల నేపథ్యంలో శుక్రవారం గూడూరు డీఎస్పీ కార్యాలయం లో వివిధ దళిత సంఘాలు, ప్రతినిధులు వాస్తవ పరిస్థితులు వివరిస్తూ ఫిర్యాదు సమర్పించారు.ఈ సందర్బంగా జై భీమ్ ఆర్మీ వ్యవస్తాపకులు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి పులి శ్రీకాంత్ మాట్లాడుతూ మన్నూరు దళితులమైన పై దాడులు జరపడం,అవమానించడం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరి కాదున్నారు అక్కడ జరుగుతున్న సంఘటన విషయమై తెలుసుకొని న్యూస్ కవరేజ్ కు వచ్చిన విలేఖరి
పై దాడి చేయడం ఈ లాంటి చర్యలుకు పాల్పడిన వారిపైపోలీస్ ఉన్నతాధికారులు తగిన విచారణ చేపట్టి వాస్తవ విషయాలను పరిశీలించి దళితుల పట్ల చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని మన్నూరు గ్రామ దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.లేని పక్షం లో మన్నూరు దళితులకు న్యాయం జరిగే వరకూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
చేపడతామన్నారు. మానవ హక్కుల కమీషన్ ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో వివిధ దళిత సంఘాల నాయకులు తలారి కోటయ్య,పరమాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.