
ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపిన తిరుపతి పార్లమెంట్ టిడిపి క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్
*వాకాడు:* తిరుపతి పార్లమెంట్ టిడిపి క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో నేడు వాకాడు నందు కోట , వాకాడు , చిట్టమూరు మండలాలలోని పలు గ్రామాలలో దేవుని సేవ చేయుచున్న పలు చర్చిల పాస్టర్లకు, వారి సతీమణులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ దాతృత్వంతో అందించిన బట్టలను తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా దేవుని సేవ చేయుచున్న పలువురు పాస్టర్లకు బట్టలు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని క్రిస్టియన్ సెల్ సభ్యులు మరియు బట్టలు అందుకున్న పాస్టర్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి తిరుపతి పార్లమెంట్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఈసంశెట్టి నట శేఖర్ , గూడూరు పట్టణ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ వేల్పుల రమేష్ కుమార్ ,వాకాడు తెలుగు యువత నాయకులు హర్ష, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల పాస్టర్లు జోసెఫ్, డేవిడ్ అగ్ని, వెంకటరాజు రాజు మరియు పలువురు పాస్టర్లు పాల్గొన్నారు..
