Advertisements

చంద్రగిరిలో రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలు

చంద్రగిరిలో రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలు

బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా సమస్యల పోరాటానికై తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి వేడుకలు చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ తిమ్మప్ప దేవాలయం ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రాధా రంగా మిత్రమండలి సభ్యులు మాట్లాడుతూ పోరాటయోధుడు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి వేడుకలు చంద్రగిరిలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన ఆశయాలు అనుగుణంగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి, గోపినాథ్ రాయల్, దండు లక్ష్మీపతి, డి.వి.రమణ, హేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment