తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం రోజు ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ సమ్మె కాలపు ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, గత ఏడాది నిర్వహించిన 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీ లైన రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఎక్స్ గ్రేషియా, దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంపు, సంక్షేమ పథకాలు తదితర డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆలస్యత ద్వారానే నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలియజేశారు. సాధారణంగా మరణించిన లేదా ప్రమాదంలో మరణించిన, మున్సిపల్ కార్మికులకు, ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులు మరణించిన వారి కుటుంబంలో ఒకరికి కచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అలాగే ఎన్.ఎం.ఆర్. కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకు, క్లాప్ డ్రైవర్లకు, బదిలీ కార్మికులకు, పార్కులలో పనిచేస్తున్న కార్మికులకు, జీ.వో ఎం.ఎస్. నెంబర్ (36) ను అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, పై డిమాండ్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి డి.కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ప్రసాద్ బి.మురళి, మణమ్మ, బి.ప్రభావతి, ఎన్. వెంకట రమణయ్య, శాంతి వర్ధన్, ఆనంద్, సి.ఐ.టి.యు నాయకులు బీ.వి.రమణయ్య, ఎస్.సురేష్, పామంజి మణి, పుట్టా శంకరయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది.