సినిమా పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్…
సినిమా పరిశ్రమ సమస్యలను మా ద్రుష్టి కి తెచ్ఛారు…
అనుమానాలు, అపోహలు, ఆలోచన లను పంచుకున్నారు…
8 సినిమా లకు మా ప్రభుత్వం స్పెషల్ జీవో లు ఇచ్చాం…
పుష్ప సినిమా కు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం..
తెలుగు సినిమా పరిశ్రమ కు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం…
పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం…
ఐటీ, ఫార్మా తో పాటు మాకు సినిమా పరిశ్రమ మాకు ముఖ్యం…
తెలంగాణ లో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం…
ప్రభుత్వం, సినిమా పరిశ్రమ కు మధ్యవర్తి గా ఉండానికి దిల్ రాజు ను ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించాం..
సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు…
పరిశ్రమ కూడా కమిటీ ని ఏర్పాటు చేసుకోవాలి…
తెలంగాణ లో ఎక్కడైనా ఘాటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చు…
తెలంగాణ లోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి…
ముంబయిలో వాతావరణం కారణం గా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది…
కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ…
హాలివుడ్,బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు…
హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమల ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం…
పరిశ్రమ ను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం…
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం…
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం…
140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్ లో పతకాలు తెచ్చుకోలేకపోతుంది..
స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయబోతున్నాం…
గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి..
సినిమా పరిశ్రమ కు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి..
ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం…
సినిమా పరిశ్రమ ను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం…
ముఖ్యమంత్రి గా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత నాది…
నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు నాకు లేవు…
తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం…
మా ప్రభుత్వం పరిశ్రమ కు ఎల్లప్పుడు అండగా ఉంటుంది….