ఏపీకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాక
- జనవరి 8న ఉత్తరాంధ్రలో పర్యటన
- రూ.85 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
అమరావతి:
- ప్రధాని మోదీ ఏపీ రానున్నారు.
- జనవరి 8న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.
- ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయ్యింది.
- అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్. టీ.పీ.సీ, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.
- వాస్తవానికి నవంబరులోనే ప్రధాని వీటికి శంకుస్థాపన చేస్తారని అంతా భావించారు.
- అందుకు నవంబర్ 29న ప్రధాని మోదీ పర్యటనను ఫిక్స్ చేశారు.
- విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.
- కానీ తుఫాన్ కారణంగా వాయిదా వేశారు.
- ఇప్పుడు తాజాగా జనవరి 8న ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లా పర్యటన ఖాయమైంది.
- అధికారికంగా తొలిసారి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది.