Advertisements

TNSF రాష్ట్ర సభ్యులు అసనాపురం వెంకటేష్ నీ ఘనంగా సన్మానించిన శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు  మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్  ఆదేశాల మేరకు రాష్ట్రం లో జరుగుతున్న సభ్యత్వ కార్యక్రమం లో భాగంగా రాష్ట్రం లో టాప్ రెఫరల్ గా గూడూరు నియోజకవర్గం నుండి మూడవ స్థానం లో గూడూరు విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు అసనాపురం వెంకటేష్ రావడం తో గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్  , పెంచలకోన మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ తానంకి నానాజీ  మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.  శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గం లోని క్రైస్తవ సోదర , సోదరీమణులకు క్రిస్మస్ శుభాాంక్షలు తెలియజేశారు అలాగే క్రిస్టియన్ సెల్ నాయకులు ఇజ్రాయిల్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దలు గంగా ప్రసాద్  సహకారం తో జరిగిన ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి అని దీనికి సహకరించిన నాయకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు .తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు  మరియు యువ నాయకులు నారా లోకేష్  క్రియాశీలకంగా జరిపించే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్టేట్ లో 3 వ ర్యాంక్ తో గూడూరు పేరు మోత మోగించిన నా తమ్ముడు అసనాపురం వెంకటేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని  అన్నారు.అలాగే 4 వ ర్యాంక్ కూడా మా వాకాడు మండలం అతను బాబు కి రావడం కూడా ఆనందించ తగిన విషయం అని అన్నారు. నియోజకవర్గం లో 55,000 పై చిలుకు సభ్యత్వాలు నమోదు చేసి ఉన్నాము అని మాకు ఇచ్చిన టార్గెట్  ఐదువేల సభ్యత్వాలు చేస్తే పూర్తవుతుంది అని దీనికి నియోజకవర్గం లో నాయకులు అందరు సహకరించి పూర్తిచేయాలని అన్నారు. అలాగే నాయకులు మాట్లాడుతూ ..తెలుగుదేశం పార్టీ సభ్యత్వం శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన గూడూరు లో సభ్యత్వ నమోదు ముమ్మరంగా సాగుతోంది అని అన్నారు .
గూడూరు నియోజకవర్గం లో మా విద్యార్థి విభాగం నాయకులు అసనాపురం వెంకటేష్ బాగా కష్టపడ్డారు అని ఏక్కడ సభ్యత్వాలు నమోదు చేయాలి అన్న అక్కడికి వచ్చి సభ్యత్వ నమోదు చేయించేవారని అన్నారు . అతని కష్ట్టానికి ప్రతిఫలం ఈరోజు స్టేట్ లో మూడవ స్థానం లో నిలవడం అని ఎద్దేవా చేశారు.
ఈ కార్య్రమంలో నాయకులు రాష్ట్ర కార్యదర్శి శీలం కిరణ్ కుమార్,పులిమి శివకుమార్ , బిల్లు చెంచురమయ్య, అబ్దుల్ రహీం , మస్తాన్ నాయుడు ,  వాటంబేటి శివకుమార్,యువత నాయకులు ప్రణీత్ యాదవ్ , మువ్వ చరణ్ , వేముల సునీల్ , గుండల సందీప్ ,అరుణ్ కుమార్ , జీవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This