Advertisements

డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులో

డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులో

అనుమానితుడు దొరికాడు

బంటుమిల్లిలో చిక్కాడు

డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులో సెల్ ఫోన్లు… సిమ్ కార్డులు మార్చినా.. సెల్ ఫోన్ టెక్నాలజీతో అదృశ్యమైన అనుమానితుడు పోలీసులకు దొరికిపోయాడు. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో చిక్కాడు. ప్రస్తుతం భీమవరం పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కేసులో అసలు కథ మరి కొన్ని గంటల్లో వెలుగులోకి రానుంది.

మనోడు మామూలోడు కాదు

ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న తిరుమాని శ్రీధర్ వర్మకు ఏకంగా మూడు పేర్లు, సిద్ధార్థ వర్మ, సుధీర్ వర్మ, శ్రీధర్ వర్మ. ముగ్గురు భార్యలు ఉన్నారు. ఇసుక లంక గ్రామానికి చెందిన రాణి తొలి భార్య. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండవ భార్య యండగండి గ్రామానికి చెందిన రేవతి. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు లేరు. ఈ సాగి తులసీ చెల్లి. ఇక మూడో భార్య వెంకట లక్ష్మీ. ఆమెకు పదేళ్ల బిడ్డ ఉంది. ప్రస్తుతం కాళ గ్రామంలో పోలీసు స్టేషన్ ఎదుట ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. రెండో భార్య రేవతికి అక్క సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. తులసిని బెదిరించి ఆస్తి లాక్కునేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోజు వారీ కూలీలు పర్లయ్య, రాజుకు పని ఇప్పిస్తానని శ్రీధర్ తీసుకువెళ్లాడు. రాజుకు కుటుంబ సభ్యులు ఉండటంతో అతడిని హత్య చేస్తే పెద్ద గొడవ అవుతుందని అనామకుడు పర్లయ్యను లేపేసి, తులసి ఇంటికి పార్శిల్‌గా పంపించాడని, శవపేటికను తెరచి పర్లయ్య మృతదేహాన్ని చూపించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎలా తప్పించుకున్నాడు…

కాళ్ల పోలీసు స్టేషన్ ఎదుటి ఇంట్లోనే మూడో భార్య వెంకటలక్ష్మీతో అద్దెకు ఉంటున్నాడు. ఇక యండగండిలో తన మామ రంగరాజుకు మూడు ఎకరాల భూమి , భవనం ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటి మీద కన్నెశాడు. వదిన తులసిని మావయ్య ఇంటికి దూరం చేశాడు. పర్లయ్య మృతదేహాన్ని శవపేటికలో తులసి ఇంటికి పంపించాడు. తానే శప పేటిక ను తెరిచాడు. ఈ హత్య కేసు.. అలాగే ఆ లేఖ ప్రకారం డబ్బులు కట్టక తప్పదని బెదిరించాడు. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోవటానికి దస్తావేజులు సిద్ధం చేసి సంతకాలు పెట్టించే ప్రయత్నం చేశాడు. ఈ స్థితిలో తులసీ బాత్ రూమ్ కు వెళ్లి ఇక్కడ జరుగుతున్న తంతును బంధువులకు తెలిపింది. ఇక బంధువుల రాకతో.. ఈ వ్యవహారం పోలీసులకు చేరుతోందని గుర్తించిన ఈ అనుమానితుడు కారులో పారిపోయాడు. ఇప్పటి వరకు టెక్నాలజీని ఉపయోగించి అనేక సిమ్‌లు మార్చి మాయమయ్యాడు. శ్రీధర్ వర్మ మూడో భార్య ఇంట్లో మరో శవపేటిక, పార్శిల్ కవర్లు దొరకటంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు. అతడి సొంతూరు మల్లంపల్లికి వెళ్లారు. అంతే శ్రీధర్ వర్మ బంటుమిల్లిలో దొరికాడు. ఇక . మూడో భార్య వెంకట లక్ష్మీని కూడ మరో ప్రధాన నిందితురాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This