Advertisements

గూడూరు రూరల్ పోలీస్‌ స్టేషన్‌ను డీఎస్పీ రమణ కుమార్  తనిఖీ

తిరుపతి జిల్లా గూడూరు రూరల్
పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డీఎస్పీ రమణ కుమార్  తనిఖీ చేశారు.

స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి ఎస్సైను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

నేరాలను నియంత్రించడంతో పాటు శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే విజిబుల్‌ పోలీసింగ్‌తోనే సాధ్యపడుతుందన్నారు.

విలేజ్‌ పోలీస్‌ అధికారులు, పెట్రో కార్‌, బ్లూ కోల్ట్‌ సిబ్బంది తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించాలన్నారు.

డయల్‌ 100 కాల్‌ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని తెలిపారు.

ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.

అనంతరం డీఎస్పీ సిసి కెమెరాలు, సిబ్బంది పని తీరును పరిశీలించడంతో పాటు పెండింగ్‌ ఫైల్స్‌, చోరీలు, ఐటీ కేసుల స్థితిగతులపై రికార్డులను తనిఖీ చేశారు.

కేసుల దర్యాప్తులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌ పద్ధతులను పాటించాలన్నారు.

పోలీస్‌స్టేషన్‌ రికార్డులను, పరిసరాలను పరిశీలించి *సంతృప్తి వ్యక్తం చేశారు.*

ఈ కార్యక్రమంలో  గూడూరు రూరల్‌  సీఐ, రూరల్  ఎస్‌,ఐ  మనోజ్ కుమార్  ,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment