శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్
తిరుమల శ్రీవారిని అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నేటి శుక్రవారం ఉదయం ప్రాతః కాల సమయంలో కుటుంబ సమేతంగా అభిషేక సేవలో సేవించుకుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రేణిగుంట విమానాశ్రయంలో సిఎస్ కి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జె.సి. శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సి.ఎస్. కి తిరుమల శ్రీవారి జ్ఞాపికను జిల్లా కలెక్టర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో, శ్రీకాళహస్తి రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహశీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.