Advertisements

గూడూరు 2 రెండవ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే

పాల్గొన్న టిడిపి నేతలు చెంచురామయ్య, ఇశ్రాయేల్ , రహీమ్ లు.

గూడూరు రెండో పట్టణంలోని ఇందిరానగర్, జానకిరాంపేట  లోని ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

         ప్రభుత్వ పాఠశాలల్లో హాజర శాతాన్ని పెంచి పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలు , విద్యా బోధన నాణ్యత ప్రమాణాలు పెంచి పాఠశాలల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డేని ఘనంగా నిర్వహించి ఆ పాఠశాలలోని సమస్యలు తెలుసుకుని వాటిని తీర్మాన రూపంలో రాసి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారికి అందజేసి విద్యా శాఖ మంత్రి లోకేష్ బాబు ద్వారా ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిడిపి నేతలు బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ , అబ్దుల్ రహీంలు పేర్కొన్నారు. సమావేశ అనంతరం అతిదులువిద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు , రంగవల్లి పోటీలలో గెలిచిన విద్యార్థుల తల్లిదండ్రులకు క్విజ్ పోటీల్లోబహుమతుల పంపిణీ, స్కూలు కాంపౌండ్ లో చెట్లు నాటి మధ్యాహ్న భోజనాలు పంపిణీ చేయడం జరిగింది.

        ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కాంతమ్మ , విజయ, పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది ఆయా పాఠశాలల పూర్వ విద్యార్థులు చక్రవర్తి , కృష్ణ, మురళి నాయుడు లల్లు ప్రసాద్, చంద్రయ్య, విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment