రాష్ట్ర ప్రభుత్వం నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పేరెంట్స్ అండ్ టీచర్స్ మెగా డే ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు పాఠశాల పూర్వ విద్యార్థులతో కలసి నరసింగరావు పేట MKPS మున్సిపల్ ప్రాథమిక పాఠశాల( సీతమ్మ బడి) లో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గుడ్ ఈవెనింగ్ నియోజకవర్గ టిడిపి మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మాజీ కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు టీచర్స్ పేరెంట్స్ పూర్వ విద్యార్థులతో కలిపి ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించాలని నిర్దేశించారని ఈ కార్యక్రమంలో పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు పాఠశాల నిర్వహణ పాఠశాలలోని స్థితిగతులు తెలుసుకొని వాటిని సరిదిద్ది ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల హాజర శాతాన్ని పెంచి నాణ్యమైన విద్యనందించాలని ఈ కార్యక్రమాన్ని వినూతనంగా చేపట్టడం జరిగిందని ప్రభుత్వ పాఠశాలలో బీఈడీ చదివి పూర్తి ట్రైనింగ్ తీసుకుని విద్యా బోధన చేసే టీచర్లు ఉంటారని కనుక తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ముందుకు రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం మాజీ కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, హెడ్మాస్టర్ హేమలత పూర్వ విద్యార్థులు హరిబాబు, శంకర్ నాయుడు కేశవ నాయుడు, ఛాన్ భాషా మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.