తిరుపతి జిల్లా ఏ.పి.ఎస్.ఆర్టీసీ గూడూరు డిపో ఎదుట శుక్రవారం రోజు అక్రమ సస్పెన్స్ లను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నాయకులు కె.యస్.వాసులు ఆధ్వర్యంలో రెండో రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి యస్.యస్.వి.కృష్ణ నాయకత్వం వహించడం జరిగింది. ముందుగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా S.W.F. కార్యదర్శి E.శివకుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం సీనియర్ నాయకులు పుట్టా శంకరయ్య లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం జిల్లా ఎస్.డబ్ల్యూ. ఎఫ్. కార్యదర్శి E. శివకుమార్ మాట్లాడుతూ గూడూరు డిపో మేనేజరు వైఖరి పై రీజనల్ మేనేజర్ గారు దృష్టి పెట్టాలని ఎస్.డబ్ల్యూ.ఎఫ్. సభ్యుల సస్పెన్షన్, వెనుక ఉన్న సస్పెన్స్ గుర్తించాలని, తద్వారా అక్రమ సస్పెన్స్ లను రద్దుచేసి కార్మికులను విధులకు తక్షణం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిపో ఎస్.డబ్ల్యూ.ఎఫ్ సహాయ కార్యదర్శి కె.ఎస్.వాసులు మాట్లాడుతూ డి.ఎం. ఉద్దేశపూర్వకంగానే ఎస్. డబ్ల్యూ.ఎఫ్. సభ్యులను సస్పెండ్ చేశారని, ఇతర యూనియన్ సభ్యుల కేసులను 1/2019 సర్కులర్ ప్రకారం పరిష్కరించి, ఎస్.డబ్ల్యూ.ఎఫ్ సభ్యులకు వర్తింప చేయక పోవడం అన్యాయమని, ముందు ముందు కేసులు పట్ల సానుకూలంగా మాట్లాడిన డి.ఎం. ఎందుకు ఇలా అక్రమ చర్యలకు పాల్పడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ లను రద్దు చేసే వరకు, తీవ్ర ఉద్యమాలకు వెనకాడ బోమని హెచ్చరించడం జరిగింది. అనంతరం గూడూరు పట్టణ సి.ఐ.టి.యు అధ్యక్షులు బి.వి.రమణయ్య మాట్లాడుతూ అద్దె బస్సుల సిబ్బంది పట్ల, పనిచేసే కార్మికుల పట్ల, డి.ఎం. దురుసు వైఖరి మార్చుకోవాలని, డిపో లో సాయంత్రం ఆరు దాటితే లైట్లు ఉండవని ప్రయాణికులు కటిక చీకటిలో బస్సు ల పేర్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బస్సు సర్వీసుల పట్ల, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే చర్యలు చేపట్టకుండా, ఉద్యోగ కార్మికులను పక్షపాత వైఖరితో వేధింపులకు గురి చేస్తే సహించబోమని, ప్రవర్తన మార్చుకోవాలని ఆయన హెచ్చరించడం జరిగింది. సి.ఐ.టి.యు గూడూరు పట్టణ కార్యదర్శి యస్.సురేష్ మాట్లాడుతూ సి.ఐ.టి.
యు.సంఘాల ద్వారా తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, డిపో మేనేజర్ వైఖరి డిపోలోని ప్రతి ఉద్యోగికి తెలుసునని, ప్రతి ఉద్యోగి అక్రమ సస్పెన్షన్ రద్దు కోసం జరిగే కార్యక్రమాలకు సహకరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిపో.ఎస్.డబ్ల్యూ. ఎఫ్. కమిటి సభ్యులు పి.కిరణ్, వై.యస్.రాజు, పి.రమణయ్య, ఎస్కే.బాషా, పి.రవీంద్రయ్య ఎం.ఎస్.వాసులు, ఎస్.కృష్ణయ్య ఏ.పెంచలయ్య, ఆర్.భాస్కర్, పి. రవీంద్ర, సుకుమార్, వి.అజంత, ఎస్.డి.జబీన్, సి.ఐ.టి.యు నాయకులు పామoజ మణి, గండికోట మధు, గుర్రం రమణయ్య,ఆడపాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.