Advertisements

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ఒకటవ పట్టణ సీఐ హెచ్చరిక

ఆర్టీసీ సమీపంలో వాహన తనిఖీలు

ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని గూడూరు ఒకటవ పట్టణ సీఐ శేఖర్ బాబు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఆటోలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని ఆటో డ్రైవర్లకు జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, నిబంధనలను అతిక్రమించి ప్రయాణీకులకు ఆటోలలో ఎక్కించకూడదనన్నారు. నిబంధనలను పాటించి ప్రమాదాలను నివారించడంలో సహకరించాలని కోరారు. నిబంనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఒకటవ పట్టణ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Leave a Comment