Advertisements

రెవెన్యూ సదస్సులో ఇచ్చే అర్జీలకు 100% పరిష్కారం

చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో తాసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన రెవిన్యూ సదస్సు కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు.ముందుగా వారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…రెవెన్యూ సదస్సులో ఇచ్చే అర్జీలకు 100% పరిష్కారం లభిస్తుందని, భూమిలేని నిరుపేదల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని,ఈ సదస్సులకు ప్రతి ఒక్క అధికారి హాజరై, ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్.గుండాల లీలావతి, శైలజ, కీరవాణి,మునిశేఖర్ గౌడ్,ప్రవీణ్ రెడ్డి, ఈవో నవీన్ కుమార్, ఎస్సై సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This