ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గూడూరు పట్టంలోని రిటర్డ్ ఎంప్లాయిస్ భవనంలో మలాలా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ణయం మాలలకు విషధాకరమైన వార్త అని ఇందుకు నిరసనగా డిసెంబర్15వ తేదీన గుంటూరు లో హలో మాల,చేలో గుంటూరు మాల మహాగర్జన సభను ఏర్పాటుచేస్తున్నామని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మైన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు.ఆయన మాట్లాడుతూ 2004 ఒకసారి వర్గీకరణ చేయగా, సుప్రీంకోర్టు లో వర్గీకరణ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని,అప్పట్లో మాలలు అనేకమంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు, ఉద్యోగులు కోల్పోయారన్నారు.1200 కులాలు కలిపి షెడ్యూల్ కులం అని డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిస్తే, అలాంటి కులాలు వేరుచేయడానికి మీరెవరని అన్నారు.సుప్రీంకోర్టు నిర్ణయంను మేము వ్యతిరేకిస్తున్నాం, అసంపూర్ణ మైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందన్నారు.రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వర్గీకరణ చెయ్యాలన్నారు.మందా కృష్ణ మాదిగ మందబుద్ధితో ఇక్కడ వర్గీకరణ చిచ్చు పెడుతున్నాడు, మాకు మాల మాదిగ కు తేడాలులేవు, మేము ఐక్యంగా ఉండలనుకుంటున్నామన్నారు.కులగణన జరగకుండా వర్గికరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మా మాల సంఘాలతో సమీక్షించారా, ఇప్పుడు ఎందుకు కమిషన్ వేశారు, ఎట్టిపరిస్థితుల్లోనూ వర్గికరణ జరగదు,జరగనివ్వం,2004 ఎన్నికలలో చంద్రబాబు కు ఎలాంటి దెబ్బ తగిలిందో,ఇప్పుడు కూడా తగలకు మానదన్నారు.కమిషన్ ను రద్దు చేయండి, మంద కృష్ణ తెలంగాణ వ్యక్తి ఆంధ్రకు రానివ్వకండి, కులగణన చేయండి, ఆర్ధిక వివరాలు సేకరించండి.., ఇవన్ని లేకుండానే వర్గికరణ చెయ్యాలంటే ప్రాణత్యాగం కు కూడా వెనుకడం వేయమన్నారు. మాలల బలం గుంటూరు లో జరిగే మాల మహాగర్జన లో ఈ ప్రభుత్వానికి చూపిస్తామని, రాష్ట్రంలోని మలాలందరు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాగర్జన సభను జయప్రదం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు తుళ్ళిబిల్లి అశోక్ బాబు,దాసరి సుందరం,
గూడూరు డివిజన్ జెఎసి అధ్యక్షులు మీజురు మాధవ్,జెఎసి సభ్యులు గిద్దలూరు రఘు,దాసరి అశోక్(ఎల్ ఎల్ బి),జెఎసి సభ్యులు బళ్ల హరి,
నెల్లూరు జిల్లా ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షులు కర్లపూడి వెంకటరమణయ్య, కేశవ,పాల మల్లికార్జున, దార్ల ఏడుకొండలు, శివ ప్రసాద్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.