చిల్లకూరు మండల కేంద్రంలోని భవిత విద్యా కేంద్రంలో ప్రపంచ వికలాగుల దినోత్సవం సందర్బంగా బుధవారం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు ధాత్రుత్వంతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి,బహుమతులను,పిల్లలకు వారి తల్లిదండ్రులకు భోజనాలను అందజేశారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ గోపి మాట్లాడుతూ…విద్య, వైద్యంలోనే కాకుండా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టు ప్రతి సంవత్సరం అందిస్తున్న సేవలు అభినందనీయమని,వికలత్వం అనేది మనిషికే కాని,మనస్సుకు కాదని,చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఇఓ లు,సనత్ కుమార్,రవూఫ్,ట్రస్ట్ సభ్యులు బాబు,ఉపాధ్యాయులు నాగరాజు, లలిత తదితరులు పాల్గొన్నారు.