Advertisements

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జగ్గయ్యపేట, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, మంగళగిరి, చెన్నూరు, జైపూర్ మండలం, మంచిర్యాల, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో 2 సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి.. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

సింగరేణి కోల్‌ బెల్ట్‌కు దగ్గరగా భూకంప కేంద్రం
భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా భూ ప్రకంపనలు
ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెంలో ప్రకంపనలు
వరంగల్‌ జిల్లాలోనూ పలుచోట్ల కంపించిన భూమి
కోల్‌బెల్ట్‌ దగ్గర ఉండడంతో ప్రజల భయాందోళనలు
కోల్‌బెల్ట్‌ దగ్గర ఇంత తీవ్రత రావడం ఇదే తొలిసారి

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This