తెలంగాణకు ఎన్ని కోట్లు తెస్తారు.. కిషన్ రెడ్డి?: CM రేవంత్
తెలంగాణకు ఎన్ని కోట్లు తెస్తారు.. కిషన్ రెడ్డి?: CM రేవంత్
కిషన్ రెడ్డిని 25 ఏళ్లుగా HYD ప్రజలు మోస్తున్నారని CM రేవంత్ అన్నారు. ‘మీరు మూసీలో పడుకున్నా.. మునిగినా ప్రజలు పట్టించుకోరు. మూసీ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురా. ప్రజలకు ఇల్లు కట్టిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి ఇచ్చేందుకు సిద్ధం. మూసీకి గోదావరి నీళ్లు తేవాలంటే ₹7వేల కోట్లు కావాలి. RRR, రేడియాల్ రోడ్లకు ₹50 వేల కోట్లు, మెట్రో విస్తరణకు ₹35 వేల కోట్లు కావాలి. TGకి ఎన్ని కోట్లు తెస్తారు కిషన్ రెడ్డి?’ అని ప్రశ్నించారు..