Advertisements

ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలవాడల ల్లో నూతన కమిటీలు ఏర్పాటు

సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పు మనువాదుల తీర్పు అని, పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల ను  15 శాతం నుంచి 30 శాతానికి పెంచమని, ఎస్సీ కుల గణన చేయాలని, ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సి వర్గీకరణ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది.ఎస్సి వర్గీకరణ పోరాట సమితినీ బలోపేతం చేసే దిశగా గత కొన్ని నెలలు ఎస్సి వర్గీకరణ పోరాట సమితి నాయుకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మాల వాడ ల్లో యువత తో నూతన కమిటీ లు వేస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారు.అందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కోట వారి ఆధ్వర్యంలో డాక్టర్ యు రామకృష్ణారావు  రిటైర్డ్ కమిషనర్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి  గృహం  నందు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకమిటీ తీసుకున్న నిర్ణయాలుతీసుకోవడం జరిగింది.అందులో ప్రధానంగ నవంబర్ 26 న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా  కోట పట్టణంలో క్రాస్ రోడ్డు నుంచిఉదయం 9 గంటల నుండి కార్ స్టాండ్ వద్ద నున్న డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కాంశ్య విగ్రహం వరకు  భారీ బైక్ ర్యాలీ నిర్వహించాలనీ నిర్ణయం తీసుకొన్నారు.ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు,రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి నాయుకులు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగాసమితి  అధ్యక్షుడు మీజూరు  మాధవ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పు మనువాదుల తీర్పు అని, పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల ను 15 శాతం నుంచి 30 శాతానికి పెంచమని, ఎస్సీ కుల గణన చేయాలని, ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు* *కల్పించాలని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే ఉందని, క్రిమిలేయరనే సమస్యను తీసుకొచ్చి భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తి వేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.దళితులకు మునిసిపాలిటీ లలో సపాయి కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తికి జాబ్ వస్తే రెండు తరాల వరకు రిజర్వేషన్లు ఉండకుండా ఈ క్రిమిలేయర్ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రలల్లో మాలలు తక్కువ లేరని, మాల మాదిగలు సమానంగా ఉన్నారని,  సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెనక్కి తీసుకునేంత వరకు మాలల పోరాటం ఆగదని స్పష్టం చేశారు.సబ్ కమిటీల లో రిటైర్డ్ జడ్జి లను గానీ, ప్రజెంట్ జడ్జి  లను గానీ తీసుకోవాలని ఇటీవల జిల్లా కలెక్టర్ లకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు మనువాదులు ఇచ్చిన సూచనకు అనుకూలంగా ఉందని, వర్గీకరణ అంశం రాష్ట్రాలకు వదిలేయడాన్ని ఖండించారు. వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను వెనక్కి తీసుకోవాలని, లేనిచో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు రామకృష్ణ రావు ( రిటైర్డ్  హెల్త్ కమిషనర్) గౌరవ సలహాదారులు టీచర్ వెంకటరమణయ్య ,పాల మల్లి , దార్ల ఏడుకొండలు , పిండి కేశవ , నల్ల మాక ప్రసన్న , పాలిచర్ల సుబ్బరాయుడు, పనబాక హేమంత్ గని, దేసయ్య,పసలచిరంజీవి , టీచర్ శ్రీనివాసులు, నవకోటి బాబురావు , కనుపూరు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This