నిరుపేద నిరాశ్రాయులకు భోజన పొట్టాల పంపిణీ
నేటితో 30వ వారం
ఫోటో రైటప్: భోజన పొట్లాలను పంపిణీ చేస్తున్న ట్రస్ట్ ప్రతినిధులు
గూడూరు: మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమం నేటితో 30 వ వారం ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సర్తాజుద్దీన్ కార్యదర్శి అమృద్దీన్ మాట్లాడుతూ మా సంస్థ ద్వారా నిరంతరాయంగా ప్రతి ఆదివారం స్వచ్ఛందంగా భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని అందులో భాగంగానే ఈ రోజు పలు ప్రాంతాల్లోని నిరుపేద నిరాశ్రయులను గుర్తించి 50 మందికి భోజనం పొట్లాలను అందించమని అన్నారు ఆదివారం వస్తే మా ఇంటిల్లపాదికి పండుగ వాతావరణం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా నిర్వహిస్తూ వస్తున్నామని ఇంకా ఎక్కువ స్థాయిలో సేవ చేసే భాగ్యాన్ని అల్లాహ్ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మొహమ్మద్ సర్తాజుద్దీన్, మొహమ్మద్ అమృద్దీన్ లు పాల్గొన్నారు.