Advertisements

దారుణ హత్య- అక్రమ సంబంధమే కారణం!

వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ బాషా వెల్లడి

ఈ నెల 17 వ తేదిన తిరుపతి జిల్లా, వాకాడు మండలం, దుగరాజపట్నం గ్రామం దక్షణ పల్లంపొలాలకు పోవు మట్టి రోడ్డు సమీపంలో కల్లూరు రాధయ్య పొలాల సమీపంలో ఉన్న తాడి చెట్ల పొదల్లో ఓ గుర్తు తెలియని మృత దేహాన్ని స్థానికులు గుర్తించి దుగరాజపట్నం గ్రామం వి ఆర్ వో కు  సమాచారం ఇవ్వడం తో ఆయన వెంటనే వాకాడు సీఐ హుసేన్ బాషా, వాకాడు ఎస్సై నాగ బాబులకు సమాచారం ఇవ్వడం తో వెంటనే స్పందించి సీఐ, ఎస్సై లు పోలీస్ సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకొనీ గుర్తు తెలియని మృతదేహన్నిపరిశీలించారు. ఎటువంటి ఆచూకీ తెలియకపోవడంతో  పార్దివ దేహాన్ని వాకాడు మండలం, బాలి రెడ్డి పాలెం ప్రభుత్వం ఆసుపత్రిలోని మార్చురీ రూమ్ కి తరలించారు.వెంటనే  హత్య కేసుగా ఎస్సై నాగబాబు నమోదు చేశారు. తదుపరి మీడియా కు సీఐ, ఎస్సై లు వెల్లడించారు. మీడియా, షోషల్ మీడియా లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య అంటూ న్యూస్ లు వైరల్ కావడం తో  గూడూరు కు చెందిన మృతుడు తండ్రి బాలిరెడ్డి పాలెం కు చేరుకొని పార్దివ దేహాన్ని పరిశీంచడం తో మృతుడు తన బిడ్డ కొండా అనిల్ కుమార్ రెడ్డి గా గుర్తించారు. తరువాత  డి ఎస్పీ ఆదేశాలు మేరకు సీఐ హుసేన్ బాషా, ఎస్సై నాగబాబు లు వేగవంతం గా బృందాలు గా దర్యాప్తు చేపట్టి హంతకులను పట్టుకొని శనివారం వాకాడు సర్కిల్ కార్యాలయం లో సీఐ హుసేన్ బాషా ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.ఈ సందర్బంగా జరిగిన విలేకరుల సమావేశం లో సీఐ హుసేన్ బాషా మాట్లాడుతూ వాకాడు మండలం, దుగరాజపట్నం కొత్తూరు సమీపంలోనీ తాడి చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృత దేహంఉన్నట్ల  స్థానిక ప్రజలుగుర్తించి దుగరాజపట్నం వి ఆర్ వో ద్వారా వాకాడు పోలీసులకు సమాచారం అందించారు అని తెలిపారు.  సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి మృతుడు ఒంటి పై గాయాలు ఉండటం తో హత్య కేసు గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.మృతుడు ఎవరనే విషయం పై దర్యాప్తు చేపట్టి విలేకరుల సమావేశం పెట్టి సమాచారం మీడియాకు ఇవ్వడం తో షోషల్ మీడియా ద్వారావిస్తృతంగా ప్రచారం న్యూస్ వైరల్ కావడం తో మృతుడు గూడూరు పట్టణంలోని శివాలయం ప్రాంతానికి చెందిన కొండా అనిల్ కుమార్ రెడ్డి గా గుర్తించడం జరిగింది. అది కూడ మృతుడు తండ్రి బాలి రెడ్డి పాలెం కు వచ్చి గుర్తించడం తో మృతుడు ను గుర్తించడం జరిగిందనీ తెలిపారు.కొండా అనిల్ కుమార్ రెడ్డి హత్య కు  గల కారణాలు పై అరా తీయగా  గూడూరు పట్టణంకు చెందిన రౌడీ షీటర్ కనుపూరు శ్రీహరి అలియాస్ జెమిని భార్య తో కొండా అనిల్ కుమార్ రెడ్డి అక్రమ సంబంధం కొనసాగుతుండగా అక్రమ సంబంధం విషయం తెలుసుకొన్న  రౌడీ షీటర్ జెమిని,అనిల్ కుమార్ రెడ్డిహత్యకు వ్యూహ రచనచేశారు. జెమిని స్నేహితులైన గూడూరు కు చెందిన బాసం నరేష్ అలియాస్ చిన్న ప్రేమ్ కోట మండలం, విశ్వనాధ పురం అగ్రహారం కు చెందిన పేనేటి @పేర్నాటి చందు, గూడూరు చవట పాలెం కు చెందిన షేక్ కాలేషా, గూడూరు గాంధీ నగర్ కు చెందిన షేక్ జావీద్ లతో కలిసి నవంబర్ 16 వ తేదీ చిల్లకూరు మండలం లోని చుట్టూ గుంట నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన జెమిని కి చెందిన j j j ఫ్యామిలీ డాబా &రెస్టారెంట్ సమీపంలో మందు పార్టీ పేరుతో అనిల్ కుమార్ రెడ్డినీ స్కూటి లో ఎక్కించుకొని డాబా వద్దకు తీసుకోని వచ్చారు.*

అనిల్ కుమార్ రెడ్డికి మద్యం బాగా త్రాగించిన తరువాత వ్యూహం ప్రకారమే 16 వ తేదీ సాయంత్రం కొండా అనిల్ కుమార్ రెడ్డి నీ కర్రలతో కొట్టి చంపేశారు.ఆ తరువాత* *శవాన్ని కారులో వేసుకొని  వాకాడు మండలం, దుగరాజపట్నం గ్రామం లోని దక్షణ పల్లంపొలాలకు పోవు మట్టి రోడ్డు సమీపంలో కల్లూరు రాధయ్య పొలాల సమీపంలో పడవేసి వెళ్లిపోయారు.  వాట్సాప్ గ్రూప్ ల్లో న్యూస్ రావడంతో మృతుడను తండ్రి గుర్తించారనీ తెలిపారు.గూడూరు డి ఎస్పీఆధ్వర్యంలో సీఐ నేతృత్వంలో ఎస్సై నాగబాబు, ఎస్సై పవన్ కుమార్, మరి కొంతమంది ఎస్సై, పోలీసులు తో బృందాలు గా ఏర్పడిఐదు మంది నిందుతులను పట్టుకోవడం జరిగిందనీ తెలిపారు. సీఐ హుసేన్ బాషా 22 వ తేది శుక్రవారంమధ్యాహ్నం 1 గంట సమయంలో మొదటి ముగ్గురు ముద్దాయి లను చిల్లకూరు మండలం, చుట్టూగుంట గ్రామ నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన నున్న  j j j డాబా &ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద, మిగతా ఇద్దరూ ముద్దాయి లను సాయంత్రం 6 గంటలకు గూడూరు లోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్డు సమీపంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ముద్దాయిలు నుండి రేనాల్ట్  కంపెనీ డస్టర్ కార్,యమహా ఫాసైనో స్కూటీమరియు జామయిల్ కర్రలు స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.*  *ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించినట్లు సీఐ హుసేన్ బాషా తెలిపారు.*అంతేకాకుండా మొదటి ముద్దాయి కనుపూరు శ్రీహరి అలియాస్ జెమిని పై 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్ లో రౌడీ షిట్ ఉందన్నారు. గూడూరు చవట పాలెం కు చెందిన షేక్ కాలేషా పై 5 క్రిమినల్ కేసులు, రూరల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షిట్ ఉన్నట్లు సీఐ తెలిపారు.కేసు ను 5 రోజుల్లో ఛాలెంజ్ గా తీసుకొన్నసీఐ షేక్ హుసేన్ బాషా , ఎస్సై నాగబాబు మరియు ఎస్సైలను గూడూరు డి ఎస్పీ అభినందనలు తెలిపారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This