ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలలో క్షయ వ్యాధి అవగాహన సదస్సు
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి Dr.ప్రభావతి మరియు DLAT Dr. వెంకట ప్రసాద్ ఆదేశాలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యార్థులకు క్షయ వ్యాధి లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాధి నయమవుటకు తగు జాగ్రత్తలు గురించి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ మోహన్ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో మోహన్ ప్రసాద్ మాట్లాడుతూఎవరికైనా రెండు వారాలకు పైగా
దగ్గు, జ్వరం, గల్ల వంటి లక్షణాలుంటే వెంటనే గల్ల పరీక్ష చేసి
టిబి అని నిర్ధారణ అయితే వారికి వెంటనే 6 నెలల పాటు
వాడాల్సిన మందులు అందజేసి టిబి పట్ల తీసుకోవల్సిన
జాగ్రత్తలను తెలియజేయాలన్నారు, క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం చికిత్స అందిస్తూ మందులతోపాటు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున అందజేస్తుందన్నారు.ఆరోగ్య కేంద్రాలలో బీసీజీ వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో NPS డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మనోహర్ మరియు కలశాల సిబ్బంది , కమలమ్మ TBHV , మాధవి TBHV , నిర్మల ANM , అమృత ఆశ వర్కర్ లు పాల్గొన్నారు.