తమిళనాడు ఓపెన్ షటిల్ టోర్నమెంట్లో సత్తా చాటిన గూడూరు క్రీడాకారులు
గూడూరు :
గూడూరుకు చెందిన క్రీడాకారులు తమిళనాడు ఓపన్ షటిల్ బాడ్మింటన్ క్రీడా పోటీలలో సత్తా చాటారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ పోటీలలో గూడూరు హెచ్డీ ఎరీనా స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు అండర్ 15 విభాగంలో షాహిర్, అండర్ 9, అండర్ 11 విభాగాలలో యశ్విన్ ప్రథమ స్థానంలో నిలిచారు. నిర్వాహకుల నుండి ప్రైజ్ మనీ, షీల్డులు అందుకున్నారు. సోమవారం షటిల్ కోర్టులో ది యంగ్ గూడూర్ షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, కోచ్ హర్షవర్ధన్ రెడ్డి క్రీడాకారులను అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.