తెలుగు భాషా కన్నతల్లి తో సమానం ప్రధానోపాధ్యాయులు ఆలూరు రాజేంద్రప్రసాద్
వెంకటగిరి పట్టణం రాజా వీధిలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు
ఆలూరు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు కవి, ఆధ్యాత్మిక వేత్త చింతపట్ల సాయిబాబా పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలయేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అందరూ సాంప్రదాయ దుస్తులతో అలరించారు . ఈ సందర్బంగా విద్యార్థులచే వేమన, సుమతీ శతకాలు వంటి పద్యాలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్య పోటీలు నిర్వహించారు. అనంతరం చార్ట్లు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా చింతపట్ల సాయిబాబా మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవ రాయలు చెప్పిన.. చెయ్యేతి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తీ గలవోడా.. అనే వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగు ను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడ తో పాటు తెలుగును ప్రాచీన భాష గా గుర్తించారు. హిందీ , బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని తెలియపరిచారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన చింతపట్ల సాయిబాబా ని ప్రధానోపాధ్యాయులు ఆలూరు రాజేంద్రప్రసా సెలవతో పూల గుచ్చితో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డీన్ చంద్రశేఖర్ ,ప్రైమరీ ఇంచార్జ్ దివ్య ,ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ శ్రీలక్ష్మి, తెలుగు టీచర్లు హై స్కూల్ టీచర్ నీరజ, ప్రైమరీ టీచర్లు రమణి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు