గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని వెడిచర్ల గ్రామం లో సోమవారం శ్రీశ్రీశ్రీ మొలక వేమాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం వైభవం గా జరిగింది.
స్వస్థిశ్రీ (శోధనామ సంవత్సర శ్రావణ శుద్ధ పౌర్ణమి శ్రవణ నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశము నందు గత శుక్రవారం నుండి శాస్త్రోక్తంగా ప్రారంభమైన కార్యక్రమముతో సోమవారం నిత్యనిధులు, గర్తపూజ, రత్నన్యాసము, ధాతున్యాసము సుముహూర్తమునకు (అనగా శ్రవణ నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు) యంత్ర స్థాపన తదుపరి విమాన శిఖర ప్రతిష్టలు, తదుపరి విగ్రహ ప్రతిష్టలు, విప్ర, ధేను, దర్పణ, కన్య, తృణాగ్ని, కూష్మాండచేదన, మహిళాదన, దశవిధ దర్శనములు, తదుపరి మహా కుంభాబిషేకములు, మహాపూర్ణాహుతి, అలంకరణ, దేవతా దర్శనం, యజ్ఞపాయన వితరణ, ఋత్విక్ సన్మానములు, మహదాశీర్వదములు, కంకణ విమోచనలుతో పూర్తయ్యాయు.అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. గ్రామ ప్రజలందరూ ఈ ప్రతిష్ఠా కార్యక్రమములో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అమ్మవారిని దర్శించి, తీర్థ ప్రసాదములు స్వీకరించి, కృపా కటాక్షములు ప్రసాధించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమములో
వెడిచెర్ల గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.