- సోషల్ మీడియాలో జర్నలిస్టులపై ఆరోపణలు చేస్తే తాట తీస్తా
- సోషల్ మీడియాలో జర్నలిస్టులపై అసత్య పు పోస్టులు పెడితే కెసులు నమోదు చేయండి
- డి ఎస్పీ రమణ కుమార్ కు ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే పాశం సునీల్
- చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- సోషల్ మీడియా సైకో లను సమాజానికి దూరంగా ఉంచాలి
- పోలీసులు,అధికారులు అటువంటి వారిని ఉపేక్షించ వద్ద
- సోషల్ మీడియాలో జర్నలిస్టులపై ఆరోపణలు చేస్తే తాట తీస్తామని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ హెచ్చరించారు. ఎంతో కాలంగా జర్నలిజం లో నిజాయితీగా పనిచేసే విలేఖరులను వేధించే సోషల్ మీడియా సైకోల ఆట కట్టిస్తామన్నారు.అటివంటి వారిని ఉపేక్షించే పరిస్థితి ఇకపై ఉండబోదన్నారు. చర్యలు తప్పవని సోషల్ మీడియా సైకోలకు హెచ్చరిక చేశారు.
సోషల్ మీడియాలో సైకో లపై కేసులు నమోదు చేయండి
సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు, పోస్టులు చేసేవారిపై చట్టపరంగా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరు డి ఎస్ పి రమణ కుమార్ కు,పోలీస్ అధికారులను ఆదేశించారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజానికి , ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు వారధిగా ఉంటూ విలువలతో కూడిన వృత్తిని కొనసాగిస్తున్న జర్నలిస్టులపై కొంతమంది అసత్య అరోపణలతో సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టే వాళ్లను కఠినంగా శిక్షిస్తూ సమాజానికి దూరంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు.