- ఉత్తమ సేవాధికారి ఆర్డివో కిరణ్ కుమార్ కు జిల్లా ఉత్తమ సేవా పురస్కార ప్రశంసపత్రం
- విధి నిర్వహణ లో అహర్నిశలు శ్రమించే అధికారి
- అన్నీ శాఖలఅధికారులు తో సమన్వయంతో ఉండే అధికారి
- ప్రభుత్వాలు తలపెట్టే కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ఆయనకు ఆయనే సాటి
- 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అద్భుతం గా విజయవంతం చేసిన ఆర్డివో
- రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార ప్రశంసపత్రం అందుకొన్న ఆర్డివో కిరణ్ కుమార్
గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్ అంటే తెలియని వారు ఎవరూ లేరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.అంతలా ఆయన ప్రజలకు దగ్గర అయ్యారు. గూడూరు ఆర్డివో గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన నీతి నిజాయితీ గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఏ ప్రభుత్వం లో అయినా ప్రజా ప్రతినిధులు తో కలిసి పోయి అభివృద్ధి, సంక్షేమం, సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేస్తూ ఉంటారు. వివాదాస్పద అధికారి గా ముద్ర వేసుకున్నారు.అంతే కాకుండా సాగరమాల రోడ్డు కు భూ సేకరణ లో ఆయన చూపిన చొరవ, ఓటర్ల జాబితా తో అవకతవకలకు చోటు ఇవ్వకుండా, భూ పంపిణి కార్యక్రమం, భూ రి సర్వే విజయవంతం చేయడం,తుఫాన్, వరదల్లో సమయాల్లో ఆయన ధైర్య సాహసాలు, కోట లో ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయడంలో,గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆక్రమణలు తొలగింపు,సియం, డిప్యుటీ సియం, మంత్రుల కార్యక్రమాలు విజయవంతం చేయడం, గణ తంత్ర, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం చేయడం, గ్రీవెన్స్, ప్రజా విజ్ఞప్తు ల దినం కార్యక్రమాలు విజయవంతం చేయడం లో ఆయన చూపే చొరవ అందరిని ఆకట్టుంది.ఆపదలో ఉన్న అభాగ్యలకు అండగా, పేద విద్యార్థులకు చేయూత, అనారోగ్య బాధితులకు చేయూత అందిస్తూ గొప్ప సేవాధికారి అయ్యారు. అన్నీ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ప్రభుత్వం నుండి మంచి సేవలు అందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు సజావు గా చేయడం లో విజయం సాధించారు.ఇలా లెక్కకు లేని సేవలు చేస్తూ ఉన్నత అధికారులు నుండి ప్రశంసలు అందుకుంటున్న ఆర్డివో కిరణ్ కుమార్ సేవలకు మూడు జిల్లా బెస్ట్ ఎలక్టోరల్ అవార్డు, మూడు సార్లు ఉత్తమ సేవా పురస్కార ప్రశంసపత్రాలు అందుకున్నారు.మంత్రి ఆనం చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార ప్రశంసపత్రం అందుకొన్న ఆర్డివో ,గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కిరణ్ కుమార్ సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్ నాలుగో సారి ఉత్తమ సేవా పురస్కార ప్రశంసపత్రం అవార్డు ప్రకటించారు. దింతో గురువారం నెల్లూరు లోని ఆనం స్వగృహం లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార ప్రశంసపత్రం ను ఆర్డివో కిరణ్ కుమార్ అందుకున్నారు. ముందుగా మంత్రి ఆనం కు మొక్క అందజేసి శాలువా కప్పి సత్కరించి పుష్ప గుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు పలు విషయాలు పై చర్చించారు.