Advertisements

కోట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆవిర్భావం

జర్నలిస్ట్ ల పై దాడులు,వేధింపుల నియంత్రణ జీ ఓ నెం : 84 ను అమలు చేయాలి
…. కోట జర్నలిస్ట్ జే ఏ సీ సదస్సులో జర్నలిస్ట్ ప్రతినిధుల డిమాండ్ …
… కోట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆవిర్భావం …
….. నూతన కమిటీ కి జర్నలిస్ట్ జే ఏ సీ ఘన సత్కారం
… ఐకమత్యం గా ఉందాం.. సంక్షేమం,హక్కులు సాధించుకుందాం …
…. గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మీజూరు మల్లిఖార్జున రావు,కన్వీనర్ జీ.బాబు మోహన్ దాస్ ల పిలుపు ….
గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ డివిజన్ స్థాయిలో విస్తృతం అవుతున్నది.అందులో భాగంగా మంగళవారం మండల కేంద్రమైన కోట లో జే ఏ సీ సదస్సు నిర్వహించారు.జే ఏ సీ చైర్మన్ మీజూరు మల్లిఖార్జున రావు అధ్యక్షతన కోట లోని షాదీ మంజిల్ లో జరిగిన ఈ సదస్సు లో కోట లోని విలేఖరులు అధిక సంఖ్య లో హాజరై జే ఏ సీ లో భాగస్వామ్యులయ్యారు.కోట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆవిర్భావం జరిగింది.అసోసియేషన్ కార్యవర్గం ను పలువురు సీనియర్ పాత్రికేయుల భాగస్వ్వామ్యం తో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మీజూరు మల్లిఖార్జున రావు,కన్వీనర్ జీ.బాబు మోహన్ దాస్ లు మాట్లాడుతూ ఐకమత్యం గా ఉందాం.. సంక్షేమం,హక్కులు సాధించుకుందాం అని జర్నలిస్ట్ లకు పిలుపునిచ్చారు.విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ నిజాయితీగా పనిచేసే జర్నలిస్ట్ లను ఇబ్బందులకు గురిచేస్తే జే ఏ సీ తక్షణమే స్పందిస్తుందన్నారు.జర్నలిస్ట్ లను వేదిస్తేన్యాయ పోరాటానికి సిద్ధం గా ఉంటామన్నారు.జర్నలిస్ట్ లకు ఇంటి నివేశ స్థలాలు,ప్రమాద భీమా సౌకర్యం,వృత్తి నైపుణ్యం,ప్రెస్ క్లబ్ లు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు షేక్ జమాలుల్లా,ఉడతా శరత్ యాదవ్ లు మాట్లాడుతూ
జర్నలిస్ట్ ల పై దాడులు,వేధింపుల నియంత్రణ జీ ఓ నెం : 84 ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.గత టీ డీ పీ ప్రభుత్వం లో అమలు చేసిన 84 జీ ఓను తిరిగి అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే లా అన్ని జర్నలిస్ట్ సంఘాలు కార్యాచరణ చేపట్టాలని కోరారు.ఈ సదస్సులో జర్నలిస్ట్ లు కృపానిధి, మస్తానయ్య కోటయ్య,బాలసుబ్రమణ్యం, ప్రసాద్,మోహన్,మురళీ,రమణ,దాస రాజేష్,రాము,కిరణ్,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This